02-04-2025 01:04:41 AM
హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): సర్కార్ హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజల ఇండ్లు కూల్చివేస్తున్నది. భూముల విక్రయం పేరిట హెచ్‌సీయూలో పక్షుల గూళ్లను తొలగిస్తున్నది. నోరున్న జనంతో పాటు నోరు లేని మూగజీవాల మీదకూ బు ల్డోజర్‌ను వదులుతున్నది. హైడ్రా.. మూసీ.. భూముల విక్రయం పేరిట.. అభివృద్ధి పేరిట విధ్వంసం సృష్టిస్తున్నది.’
అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంగళవారం హెచ్‌సీయూ భూముల విక్రయ వివాదంపై ‘ఎక్స్’ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘పంటలు ఎండుతున్నాయి. సాగునీరు లేదంటూ రైతుల గోస పడుతున్నారు. సర్కార్ మాత్రం బుల్డోజర్ రాజకీయాలకు తెరతీసింది. ప్రభుత్వ తీరుతో ఇప్పుడు వన్యప్రాణాల హాహాకారాలు చేస్తున్నాయి’ అంటూ రాసుకొచ్చారు.
భావిత రాల వెలుగులైన విద్యార్థులకు చదువులు చెప్పే చోట విధ్వంసం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. ‘ప్రజలను పాలించే నాయకుడివా? లేదంటే భూములను చెరబట్టే రియల్ ఎస్టేట్ మధ్యవర్తివా ?’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ఘాటు విమర్శలు చేశా రు. ‘ఫుట్‌బాల్ ఆడేందుకు వెళ్లి.. భూములను చెరబడతావా ?’ అంటూ నిలదీశారు.