- పండుగకు సొంతూరుకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం
- ఇద్దరి దుర్మరణం, పలువురికి గాయాలు
- వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘటన
యాదాద్రి భువనగిరి, జనవరి 16 (విజయక్రాంతి): యాద్రాద్రి భువనగిరి జిల్లా వరంగల్-హైదారాబాద్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం లచ్చిరామ్ తండాకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. వివరాలు.. కేసముద్రం మండలం లచ్చిరామ్ తండాకు చెందిన అనూష, భూక్య సంతోష్ దంపతులకు ఇద్దరు కూతుర్లు.
దంపతులిద్దరూ పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటూ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు పిల్లలతో కలసి స్వగ్రామానికి వచ్చిన సంతోష్, అనూష గురువారం కారులో హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. సంతోష్ తన బావ బేరువాడకు చెందిన గుగులోతు రవి, అతని భార్య భవాని, కూతూరు మోక్షను కూడా వెంట తీసుకెళ్లాడు.
ఈ క్రమంలో రయగిరి వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ముందు సీట్లో కూర్చున్న సంతోష్ భార్య అనూష (27) కూతూరు చైత్ర (10) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సంతోష్‌తోపాటు అతని సోదరి భవానికి తీవ్ర గాయాలు కాగా సంతోష్ కుమార్తె ప్రవశ్విని, బావ రవికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ వెనుక భాగములో కారు ఇరుక్కుపోవడంతో స్థానికుల సహకారంతో పోలీసులు మృతదేహాలను బయటకు తీయాల్సి వచ్చింది.