calender_icon.png 19 January, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరాశపరిచిన ఆర్చర్లు

29-07-2024 12:05:00 AM

ఒలింపిక్స్‌లో పతకం సాధిస్తారనుకున్న భారత మహిళా ఆర్చర్ల బృందం నిరాశపరిచింది. దీపికా కుమారి, భజన్ కౌర్, అంకితలతో కూడిన భారత త్రయం క్వార్టర్ ఫైనల్లో 0 నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలైంది. క్వాలిఫయింగ్ రౌండ్‌లో మెరిసిన అంకితకీలక క్వార్టర్స్‌లో మాత్రం టార్గెట్ చేరడంలో విఫలమైంది. భజన్ కౌర్ పర్వాలేదనిపించినప్పటికీ దీపికా మాత్రం పూర్తిగా నిరాశపరిచింది. నేడు పురుషుల ఆర్చరీ క్వార్టర్ ఫైనల్ జరుగనుంది.

ముగిసిన పోరాటం

విశ్వక్రీడలో స్విమ్మింగ్ పోటీల్లో భారత్ పోరాటం ముగిసింది. భారత్ తరఫున బరిలోకి దిగిన శ్రీహరి నటరాజన్, ధినిధి సెమీఫైనల్స్‌కు చేరుకోలేకపోయారు. పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ హీట్‌ శ్రీహరి 33వ స్థానంలో, దినిధి 200 మీ ఫ్రీస్టుల్ హీట్-1లో 23వ స్థానంలో నిలిచి అర్హత సాధించడంలో విఫలమయ్యారు.