23-04-2025 12:00:00 AM
గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఏ.పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): డీసిల్టింగ్ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అకాల వర్షాల వల్ల రోడ్లపై వరద నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారన్న ఫిర్యాదు మేరకు మంగళవారం గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమా ర్ బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఏ వినయ్ కుమార్, జిహెచ్‌ఎంసి ఇంజినీరింగ్ విభాగం అధికారులతో వరద నీటి సమస్య వివరాలపై సమీక్షించారు.
అనంతరం డివిజన్ లోనీ అన్ని ప్రాంతాల్లో కచ్చా మోరి పైప్ లైన్ లలో పేరుకు పోయిన మట్టి,చెత్త చెదారాన్ని తొలగించాలని సూచించారు. మోర్ సూపర్ మార్కెట్ లేన్, కెనరా బ్యాంక్, పార్క్ మెయిన్ రోడ్డు లో జరుగుతున్న డీసిల్టింగ్ పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం లో బిజెపి డివిజన్ అద్యక్షులు వి. నవీన్ కుమార్, సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, శ్రీకాంత్, ఎం. ఉమేష్, ఆనంద్ రావు, సాయి కుమార్, డి. కుమార్, నీరజ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.