calender_icon.png 18 January, 2025 | 4:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయ్ హజారే ఎవరిదో?

17-01-2025 11:49:11 PM

వడోదర: దేశవాలీ విజయ్ హజారే ట్రోఫీ చివరి అంకానికి చేరుకుంది. రేపు వడోదర వేదికగా జరగనున్న ఫైనల్లో కర్ణాటక, విదర్భ అమీతుమీ తేల్చుకోనున్నాయి. కరుణ్ నాయర్ సారధ్యంలోని కర్ణాటక ఐదో టైటిల్‌పై కన్నేయగా.. విదర్భ తొలిసారి ట్రోఫీ అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. విదర్భ బలం కెప్టెన్ కరుణ్ నాయర్. టోర్నీలో 752 పరుగులతో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్న కరుణ్ ఖాతాలో ఐదు సెంచరీలున్నాయి. కర్ణాటక తరఫున మయాంక్, దేవదత్ పడిక్కల్ కీలకం కానున్నారు. బౌలింగ్‌లో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి.