calender_icon.png 25 October, 2024 | 9:50 AM

ప్రజలను అవమానించేలా వ్యాఖ్యలు

12-09-2024 12:19:43 AM

రిజర్వేషన్లపై రాహుల్ రంగు బయటపడింది

బీజేపీ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): అమెరికాలో పర్యటిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అక్కడి సమావేశాల్లో భారత వ్యతిరేక వ్యక్తు లు, శక్తులతో సమావేశం కావడాన్ని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ ఖండించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అణువణువునా భారత్‌ను వ్యతిరేకి స్తూ, అవకాశం ఉన్నప్పుడల్లా  విషం చిమ్మే అమెరికా సెనేటర్, పాకిస్తాన్ సమర్థకురాలు ఇలాన్ ఒమర్‌తో రాహుల్ సమావేశమవ్వడాన్ని తప్పుబట్టారు. పరిస్థితులు అనుకూ లిస్తే దేశంలో రిజర్వేషన్లను రద్దు చేస్తామని రాహుల్ వ్యాఖ్యానించడాన్ని ఖండించారు.

రిజర్వేషన్ల విషయంలో రాహుల్ అసలు రంగు, కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడిందన్నారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజా మోదంతో బీజేపీ గెలుపొందితే ఆఖరుకు ప్రజల తీర్పు ను సైతం అవమానించేలా మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని కించపర్చడమేనని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉన్నంతవరకు రిజర్వేషన్లను రద్దు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నెహ్రూ నుంచి మొదలు రిజర్వేషన్లను వ్యతిరేకించారని, రిజర్వేషన్లు కల్పించిన అంబేద్కర్‌ను ఓడించిన దౌర్భాగ్య చరిత్ర కాంగ్రెస్‌దేనని దుయ్యబట్టారు.