calender_icon.png 15 November, 2024 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

14-11-2024 01:09:29 AM

పెద్దపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న రాఘవాపూర్ వద్ద కొనసాగుతున్న రైల్వేట్రాక్ పునరుద్ధరణ పనులు 

  1. 44 రైళ్లు రద్దు, 84 రైళ్ల దారి మళ్లింపు
  2. ముమ్మరంగా కొనసాగుతున్న ట్రాక్ పునరుద్ధరణ
  3. ఒక ట్రాక్‌పై ట్రయల్ రన్

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ వద్ద పెద్దపల్లి రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఐరన్ కాయిల్స్‌తో వెళ్తున్న గూడ్స్ రైలు 11 వ్యాగన్లు బోల్తా పడ్డాయి. గూడ్స్ బోగీల లింకులు తెగిపోయి ఆ మార్గంలో ఉన్న 3 లైన్లపై చెల్లాచెదురుగా పడటంతో మూడు ట్రాక్‌లు కూడా దెబ్బతిన్నాయి. దీంతో ఉత్తర భారత దేశాలను కలిపే ప్రధాన రైల్వే కారిడార్‌గా ఉన్న కాజిపేట సెక్షన్‌లో నడిచే రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి.

మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు 44 రైళ్లను రద్దు చేశారు. 18 రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, 84 రైళ్లను దారి మళ్లించారు. 10 రైళ్ల వేళలు మారుస్తూ రీషెడ్యూలు చేశారు. దీంతో సికింద్రాబాద్ హైదరాబాద్ కాగజ్ నగర్, నర్సాపూర్ సికింద్రాబాద్ నగర్, కాజీపేట టౌన్, సిర్పూర్ టౌన్ కరీంనగర్, కరీంనగర్ సిర్పూర్ టౌన్ భద్రాచలం బలార్షా కాజీపేట, యశ్వంత్‌పూర్ కాచిగూడ సికింద్రాబాద్ ఆదిలాబాద్ అకోలా ఆదిలాబాద్ గుంతకల్ కాకినా డ గుంటూరు విజయవాడ సికింద్రాబాద్ దానాపూర్ రైళ్లను దారి మళ్లించారు.

దానాపూర్ పట్నా పట్నా బాద్, నిజాముద్దీన్ దర్భంగా యశ్వంత్ పూర్ పూర్, నిజాముద్దీన్ గోరఖ్‌పూర్ బిలాస్ పూర్ లి, అహ్మదాబాద్ చెన్నై, జైపూర్ కోయింబత్తూరు, ముజఫర్‌పూర్ సికింద్రాబాద్ తదితర రైళ్లను దారి మళ్లించారు. తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలును సికింద్రా బాద్‌వాపూ మధ్యన ఉన్న స్టేషన్ల స్టాప్‌లను తొలగించి నడపడంతో తిరుపతి రైల్వే స్టేషన్‌లో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు ప్రయాణికులు చెందిన ఆందోళనకు దిగారు. 

యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు

గూడ్స్ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో అనేక రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో ద.మ.రైల్వే అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. జీఎం అరుణ్‌కుమార్ జైన్ ఘటనా స్థలికి చేరుకుని పనులను పరిశీలించారు. విద్యుత్ తీగలను సరిచేయ డంతో పాటు ట్రాక్‌పై ఉన్న గూడ్స్ బోగీలను పక్కకు తప్పించారు.

భారీ క్రేన్లు, ప్రొక్లెయినర్లు, జేసీబీల సాయంతో వ్యర్థాలను తొలగించారు. దెబ్బతిన్న 3 ట్రాక్‌లలో పెద్ద పల్లి నుంచి రామగుండం మార్గంలోని ట్రాక్‌ను బుధవారం సాయం త్రానికి పునరుద్ధరించారు. అనంతరం ట్రాక్‌పై గూడ్స్ రైలు ట్రయల్ రన్ చేశారు.

మరోవైపు తిరుపతి నుంచి జమ్ముతావి వెళ్లే రైలును మళ్లించిన నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి జమ్ముతావికి ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి 9 గంటలకు సికిం ద్రాబాద్ నుంచి బయలుదేరింది. శుక్రవారం సాయంత్రం జమ్ముతావికి చేరనుంది.