calender_icon.png 21 October, 2024 | 8:59 AM

పట్టాలు తప్పిన బొగ్గు వ్యాగన్లు

29-07-2024 12:14:40 AM

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 28(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వం చలోని కేటీపీఎస్ కర్మాగారంలో ఆదివారం మధ్యాహ్నం బొగ్గు వ్యాగన్లు పట్టాలు తప్పా యి. సింగరేణి నుంచి కేటీపీఎస్ 7వ దశకు వ్యాగెన్‌లో బొగ్గును సరఫరా చేశారు. 7వ దశ కోల్‌ప్లాంట్‌లో బొగ్గును దిగుమతి చేసి తిరుగు ప్రయాణంలో గూడ్స్ రివర్స్ చేస్తున్న క్రమంలో ఇంజన్‌తో పాటు మరో రెండు వ్యాగెన్లు పట్టాలు తప్పాయి. బొగ్గు రవాణాలో కేటీపీఎస్ పరిధిలో ఏమైనా అవాంతరాలు సంభవించి రైల్వేగూడ్స్ నిర్ణీత సమయానికి రైల్వేశాఖకు చేరకుంటే గంట చొప్పున డ్యామరేజీ చార్జీలు చెల్లించాల్సి వస్తంది. ఆదివారానికి సంబంధించి నాలు గు గంటలకు డ్యామరేజీ చార్జీలు కేటీపీఎస్ యాజమాన్యం చెల్లించాలి. ఇదిలా ఉంటే గూడ్స్ పట్టాల తప్పిన సమాచారాన్ని కేటీపీఎస్ యాజమాన్యం గోప్యంగా ఉంచడం గమనార్హం.