కరీంనగర్, డిసెంబర్ 28 (విజయక్రాంతి) : కరీంనగర్ జిల్లా శంకర పట్నం మండలం డిప్యూటీ తహశీల్దార్ మల్లేశం రైతు నుండి రూ.6వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శనివారం పట్టుబడ్డాడు. నాలా కన్వర్షన్ కోసం మండలంలోని ఎరడపల్లికి చెందిన ఓ రైతు అనుమతులు కోరగా మల్లేశం లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శనివారం ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు డిప్యూటీ తహశీల్దార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ అనంతరం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరచనున్నట్లు ఏసీబీ డిఎస్పి రమణమూర్తి తెలిపారు.