మనోహరాబాద్, జనవరి 31 (విజయ క్రాంతి) ః మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ జాతీయ రహదారి వెంట ముదిరాజ్ కులస్తుల ఆరాధ్య దైవమైన పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణం చేపడుతున్నారు. ఈనెల 3న పెద్దమ్మ తల్లి గర్భగుడి, అంతరాలయం కడప ప్రతిష్టాపన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.
శుక్రవారం హైదరాబాదు లోని రాష్ర్ట శాసనమండలి డిప్యూటీ స్పీకర్ డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్, రాష్ర్ట తెలంగాణ మహాసభ ఉపాధ్యక్షు డు కొట్టాల యాదగిరి ముదిరాజ్‌లను కాళ్ళకల్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు కరాటే మల్లేష్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు వీరబోయిన నరేష్ ముదిరాజ్, సంఘం నాయకులు నత్తి బాలరాజు ముదిరాజ్, ఊట్ల నాగరాజు తదితరులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
సర్పంచుల ఫోరం రాష్ర్ట ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్ ముదిరాజ్, ఉమ్మడి మండల సొసైటీ అధ్యక్షుడు మెట్టు బాలకృష్ణారెడ్డి, మెదక్ జిల్లా బీజేపీ పార్టీ ఉపాధ్యక్షుడు భాషబోయిన చంద్రశేఖర్ ముది రాజ్, మనోహరాబాద్ మండలం తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కూచారం నరేష్ ముదిరాజ్, రంగా యిపల్లి తాజా మాజీ సర్పం నాగభూషణం ముదిరాజ్‌లను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు.