calender_icon.png 26 October, 2024 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో డిప్యూటీ రిజిస్ట్రార్

30-08-2024 12:37:39 AM

-రూ.లక్ష లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి):  ఓ కేసు విషయంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ  మేడ్చల్ సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్  ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ సిటీ రేంజ్ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ కలెక్టరేట్‌లోని సహకార శాఖ పరీధిలోని డిప్యూటీ రిజిస్ట్రార్ కార్యాలయంలో బొమ్మల శ్రీనివాస్‌రాజు అసిస్టెంట్ అర్బిట్రెటర్/రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. నవభారత్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమి టెడ్ కేసులో తన కుటుంబసభ్యులు, స్నేహితులకు వ్యతిరేకంగా తనకు సహాయం  చేయాలని ఫిర్యాదు దారుడు అర్బిట్రెటర్‌గా ఉన్న శ్రీనివాస్‌రాజును కోరాడు.

అంపదకు శ్రీనివాస్‌రాజు రూ.5 లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాను రూ.5 లక్షలు ఇవ్వలేనని, రూ.లక్ష మాత్రమే ఇస్తానన్నాడు. అందుకు శ్రీనివాస్‌రాజు అంగీకరించాడు. తర్వాత బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేర కు బాధితుడు రూ.లక్ష తీసుకుని గురువారం కలెక్టరేట్‌కు వచ్చాడు. శ్రీనివాస్‌రాజు సూచించిన కార్ డిక్కీలో రూ.లక్ష పెట్టాడు. అనంత రం శ్రీనివాస్‌రాజు కారు వద్దకు వెళ్లి డబ్బు తీస్తుండగా  ఏసీబీ అధికారులు  శ్రీనివాస్‌రాజును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కారు ఎవరి పేరుపై ఉందని శ్రీనివాస్‌రాజును ప్రశ్నించగా, తన కుమారుడి పేరిట ఉందని ఒప్పుకున్నాడు. ఏసీబీ అధికారులు ని ందితుడిని అదుపులోకి తీసుకున్నారు.