calender_icon.png 15 November, 2024 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌కు రష్యా ఉప ప్రధాని

11-11-2024 12:20:43 AM

12న విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ

మాస్కో/ న్యూఢిల్లీ, నవంబర్ 10: అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడం, ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ ప్రపంచంలో భారత్‌కు మధ్యవర్తిత్వం వహించే పాత్ర పెరుగుతోంది. అమెరికా, రష్యా దేశాధినేతలతో పీఎం మోదీకి సన్నిహిత సంబంధాలు ఉండడంతో అందరూ భారత్ వైపు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రధానమంత్రి డెనిస్ మంటురోవ్ భారత్‌లో పర్యటిస్తారని ఆ దేశ రాయబారం కార్యాలయం ఆదివారం తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా భారత ప్రభుత్వంతో పలు ద్వైపాక్షిక విషయాలపై డెనిస్ చర్చిస్తారని రాయబార కార్యాలయం వెల్ల డించింది.  ఈ నెల 11న ము ంబై లో ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగే రష్యన్ బిజినెస్ ఫోరమ్ ప్లీనరీ సెషన్‌లో డెనిస్ పాల్గొంటారని పేర్కొన్నది.

ఇరుదేశాల పారిశ్రామికవేత్తల మధ్య సహ కారం, లాజిస్టిక్స్, రవాణా, డిజిటల్ టె క్నాలజీ, ఫైనాన్స్ తదితర రంగాల్లో సంబంధాలను మెరుగుపరిచి విస్తరించడమే లక్ష్యంగా ఈ పర్యటన, సమా వేశాలు కొనసాగుతాయని తెలిపింది. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధా    లు మరింత బలపడే అవకాశం ఉం దని రాయబార కార్యాలయం పేర్కొన్నది.

ఈ నెల 12న ఇంటర్ గవ ర్నమెంటల్ రష్యన్ కమిషన్ నిర్వహించే సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో డెనిస్ ముంటురోవ్ భేటీ అవుతారని తెలిపింది. వాణిజ్య, ఆర్థిక, సైన్స్, టెక్నాలజీ, సాంస్కృతిక రంగాల్లో సహ కారా నికి సంబంధించిన అంశాలపై ఈ స మావేశంలో చర్చలు జరుగుతాయని పేర్కొన్నది.