calender_icon.png 3 February, 2025 | 6:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నానాల లక్ష్మీపురంలో డిప్యూటీ సీఎం పర్యటన

03-02-2025 12:45:36 AM

వైరా, ఫిబ్రవరి 2: ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమా ర్క దంపతులు పర్యటించి తన సోదరుడు డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత మల్లు వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తర్వాత సోదరుడి సమాధి వద్ద పుష్పగుచ్ఛం శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం గ్రామంలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రూ.4 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతి గురించి అధికారులు, పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, లీడర్లు శీలం వెంకట నర్సిరెడ్డి, దొడ్డా పుల్లయ్య, ఏదునూరి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.