calender_icon.png 4 March, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు తొమ్మిదిన్నరేళ్ల నిర్బంధాల మధ్య గడిపారు

09-12-2024 07:20:29 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో 20 అడుగుల తెలంగాణ తల్లి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ... డిసెంబర్ 9వ తేదీకి ఎంతో ప్రత్యేకత ఉందని, ఉద్యమ సమయంలో ప్రత్యేక తెలంగాణ ఇస్తున్నట్లు కేంద్రం నుంచి తొలి ప్రకటిన ఈ దినమే వచ్చిందని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామాకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నామని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గత పదేళ్లు నెరవేరలేదని భట్టి తెలిపారు. రాష్ట్ర ప్రజలు తొమ్మిదిన్నరేల్లు నిర్భంధాల మధ్య గడిపారని, గత ప్రభుత్వం రాష్ట్రాన్ని భారీ అప్పుల్లోకి నెట్టి అతలాకుతలం చేసింది విమర్శాలు చేశారు. భారీ అప్పుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రాలు చేపట్టామన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, తొలి ఏడాదిలోనే రైతు రుణమాఫీ కింద రూ.21 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వాన్ని ఇచ్చారని మండిపడ్డారు. పదేళ్లపాటు విద్యార్థుల డైట్ ఛార్జీలను గత ప్రభుత్వం పెంచలేదని, కాంగ్రెస్ పభుత్వం అధికారంలోకి వచ్చి  విద్యార్థుల డైట్ ఛార్జీలను ఒకేసారి 40 శాతం పెంచిందని హర్షం వ్యక్తం చేశారు. గురుకులాలకు కూగా సరైన భవనాలను నిర్మించకపోవడంతో పదేళ్లపాటు ఒకే గదిలో హాస్టల్, తరగతులు అన్నట్లుగా ఉండేదని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. పదేళ్లపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించలేదని, ఇప్పుడు తెలంగాణలోని ప్రతి తల్లి, చెల్లికి ప్రతీకగా తెలంగాణ తల్లి ఉందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.