హైదరాబాద్ : గ్రూప్-2 వాయిదాను పరిశీలించాలని టీజీఎస్పీఎస్సీకి డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క ఆదేశించారు. నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ లో గ్రూప్-2 నిర్వహణపై పరిశీలిస్తామని భట్టీ చెప్పారు. టీజీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డికి భట్టి విక్రమార్క ఫోన్ చేసి డిసెంబర్ లో గ్రూప్-2 నిర్వహణపై పరిశీలించాలని సూచించారు. సచివాలయంలో గ్రూప్-2 అభ్యర్థులతో భట్టీ విక్రమార్క, ఎంపీ మల్ల రవి, బలరాం నాయక్ చర్చించారు. త్వరలో ఉద్యోగ ఖాళీలపై జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని భట్టి పేర్కొన్నారు.
ఓవర్ ల్యాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని, త్వరలో ప్రతి అసెంబ్లీ స్థానంలో అంబేద్కర్ నాలెడ్జ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం నాలెడ్జ్ కేంద్రాలు అవసరామని, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఆన్ లైన్ లో ఉచిత శిక్షణ క్లాస్ లు ఇప్పిస్తామన్నారు. శిక్షణ కోసం నిపుణులను తీసుకువస్తున్నామని, హైదరాబాద్ కేంద్రంగా ఆన్ లైన్ పాఠాలు బోధిస్తారని ఆయన తెలిపారు. అభ్యర్థుల ప్రశ్నలకు ఆయా కేంద్రాల్లోనే అనుమానాల నివృత్తిని ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క పేర్కొన్నారు.