calender_icon.png 15 November, 2024 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తే తప్ప.. ప్రపంచంతో పోటీ పడలేం

13-11-2024 06:03:07 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తే తప్ప ప్రపంచంతో పోటీ పడలేమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పారశ్రామలను పెద్దఎత్తున తీసుకొచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. గ్రామాల్లో కూడా అభివృద్ధిని విస్తరిస్తామని, వెనుకబడిన కొడంగల్ ను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వెనుకబడిన కొడంగల్ లో పరిశ్రమలు రావాలంటే భూసేకరణ జరగాల్సిందే అన్నారు. భూములు కోల్పోతున్న రైతున్నల బాధను ఇందిమ్మ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని భట్టి చెప్పారు. ఇల్లు కోల్పోతున్న వారికి మంచి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూమి కోల్పోతున్నవారికి మెరుగైన ప్యాకేజీతోపాటు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ శ్రేణులు కావాలనే కుట్రపూరితంగా కలెక్టర్, ఉన్నాతాధికారులపై అమాయక గిరిజనులను రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పారని మండిపడ్డారు.  ఈ సందర్భంగా వికారాబాద్ లో జరిగిన హింసాత్మక ఘటనను డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క ఖండించారు. దాడి సమస్యకు పరిష్కారం కాదు.. జిల్లా కలెక్టర్ తో చర్చించి పరిష్కారించుకోవాలని సూచించారు. ఇందిరమ్మ రాజ్యంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని, యువతకు ఉద్యోగాలు రావాలని బీఆర్ఎస్ కు ఇష్టంలేదా..? అని ప్రశ్నించారు. ఇది బాధ్యత కలిగిన ప్రతిపక్షం చేయాల్సిన పని కాదని దుయ్యబట్టారు. గతం పదేళ్లు అధికారంలో ఉన్న మీరు చాలా ప్రాజేక్టుల కోసం భూసేకరణ చేశారు. కానీ ఏనాడూ కాంగ్రెస్ పార్టీ కాదనలేదే..?  అని భట్టీ విమర్శించారు.