calender_icon.png 15 April, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవారిని దర్శించుకున్న పవన్ సతీమణి అన్నా లెజినోవా

14-04-2025 09:26:43 AM

తిరుమల,(విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజినోవా సోమవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్న అన్నాలెజినోవాకు టీటీడీ అధికారులు వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్ద స్వాగతం పలికారు. దర్శనంతరం రంగనాయకల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేసి ఆమెకు ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. తర్వాత అన్నాలెజినోవా అఖిలాండం వద్దకు చేరుకొని కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కలు చెల్లించుకున్నారు. 

పవన్ కల్యాణ్ అన్నాలెజినోవా చిన్న కుమారుడు మార్క్ అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి తన కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడినందుకు ఆమె ఇవాళ శ్రీవారిని దర్శించుకున్నారు. అన్నాలెజినోవా ఆదివారం సాయంత్రమే తిరుమలకు చేరుకొని స్థానిక గాయత్రీ నిలయంలో బస చేశారు. క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ఆమె తొలుత శ్రీ భూవరాహస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పద్మవతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కల్యాణకట్టలో తలనీలాలను సమర్పించారు. అన్యమతస్థురాలు కావడంతో మొదట అతిథిగృహంలో డిక్లరేషన్ పై సంతకం చేశారు.