అమరావతి: కాకినాడ
జిల్లా గైగోలుపాడుకు చెందిన మణికంఠ (23), చరణ్
(22) ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్(Game Changer Pre Release Event ) ఈవెంట్‌కు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా
జరిగిన రోడ్డు ప్రమాదంలో దారుణంగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
కాకినాడ-రాజమండ్రి మార్గంలో రంగంపేట మండలం ముకుందవరం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం
జరిగింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(deputy chief minister pawan kalyan) శుక్రవారం ప్రమాద స్థలాన్ని సందర్శించి ఘటనా
స్థలాన్ని పరిశీలించారు. ఏడడీబీ రోడ్డు మీదుగా పిఠాపురం
వెళుతుండగా పవన్ కళ్యాణ్ ప్రమాద స్థలం వద్ద ఆగి ఘటనకు గల కారణాలను అధికారులను
అడిగి తెలుసుకున్నారు.
జనవరి
4న రామ్ చరణ్(Global Star Ram Charan) 'గేమ్ ఛేంజర్' సినిమా
ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరగగా,
పవన్ కళ్యాణ్
ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ ఘోర ప్రమాదం తరువాత, పవన్
కళ్యాణ్ జనసేన తరపున మరణించిన అభిమానుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. నటుడు రామ్ చరణ్, నిర్మాత దిల్
రాజు(Indian film producer Dil Raju) కూడా బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5
లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
రాజమండ్రి
నుంచి పిఠాపురం పర్యటన(Pawan Kalyan Pithapuram tour)కు వెళ్తూ మార్గమధ్యంలో రామస్వామిపేట వద్ద ఏడీబీ రోడ్డు
నిర్మాణం పనులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రోడ్డు నిర్మాణం
ఎప్పుడు ప్రారంభం అయ్యింది. ఎంత వరకు పూర్తయ్యింది. ప్రస్తుతం పనులు ఎలా
సాగుతున్నాయి తదితర వివరాలను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్(East Godavari District Collector) పి. ప్రశాంతి, ఇతర
అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు వెంట కాలి నడకన వెళ్తూ డ్రెయిన్ సౌకర్యం, నిర్మాణం
పనుల్లో నాణ్యతను పరిశీలించారు. ఇటీవల
గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ సమయంలో వడిశలేరు వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు
అభిమానుల ప్రాణాలు కోల్పోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాదానికిగల కారణాలు
అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్
శ్రీనివాస్(Tangella Uday Srinivas), కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి, ఇతర
ఉన్నతాధికారులు పవన్ కళ్యాణ్ లో పాటు ఉన్నారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గంలో పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల సభలో పాల్గొన్నారు.