calender_icon.png 16 November, 2024 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీకి డిప్యూటీ సీఎం

19-09-2024 02:26:59 AM

పార్టీ నాయకులు, కేంద్ర మంత్రులతో భేటీ 

హైదరాబాద్, సెప్టెంబర్ 18        (విజయక్రాంతి): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంట ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా హస్తినకు వెళ్లారు. రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలపై కేంద్ర మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో  భట్టి భేటీ అవుతారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గా లు తెలిపాయి. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ఊహగాహనాల నేపథ్యంలో భట్టి ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలతో భేటీ అయిన విషయం తెలిసిందే.