calender_icon.png 27 December, 2024 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

08-11-2024 03:00:07 PM

నాగిలిగొండ,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగొండలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు. బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. నాగిలిగొండ నుంచి కొండవనమాల వరకు రూ.4.50 కోట్లు, నాగిలిగొండ నుంచి గొల్లెనపాడు వరకు రూ.7.10 కోట్లుబీటీ రోడ్ల నిర్మాణానికిి కేటాయించినట్లు భట్టి తెలిపారు. భవిష్యత్ తరాలకు ఉపమోగపడే విధంగా నాణ్యత ప్రమాణాలతో కూడా రోడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో పర్యటించి, గ్రామాస్తుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు.