calender_icon.png 1 October, 2024 | 5:09 AM

జపాన్‌కు డిప్యూటీ సీఎం భట్టి

01-10-2024 02:27:14 AM

మూడు రోజులపాటు పర్యటన 

పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): వారం రోజుల అమెరికా పర్యటన తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం జపాన్‌కు వెళ్లారు. భట్టికి జపాన్‌లోని హానిడా విమానాశ్రయంలో భారత రాయబార కార్యాలయ ప్రతినిధులు అజయ్ సేథి, మధుసూదన్, అమన్ ఆకాశ్ స్వాగతం పలికారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.

తెలంగాణలో పునరుత్పాదక విద్యుత్ పరిశ్రమలకు తోడ్పాటు, వివిధ పరిశ్రమల్లో భాగస్వామ్యం వంటి అంశాలపై ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చించనున్నారు. జపాన్‌లో పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలపై భారత రాయబారి సీబీ జార్జి డిప్యూటీ సీఎంకు వివరించారు. పెట్టుబడులతో వచ్చే కంపెనీలతో మంగళవారం డిప్యూటీ సీఎం రౌండ్ టేబుల్ సమావేం నిర్వహిస్తారు.

పారిశ్రామిక వేత్తలతో విడివిడిగా సమావేశమవుతారు. అదేరోజు సాయంత్రం యమాంషి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను సందర్శిస్తారు. 2వ తేదీన తోషిబా, కవాసాకి, యాక్లహామ పరిశ్రమలను సందర్శిస్తారు. 3వ తేదీన ఒకాసలోని పానాసోనిక్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శిస్తారు. 4న డిప్యూటీ సీఎం బృందం హైదరాబాద్‌కు చేరుకుంటుంది. భట్టి వెంట ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణరావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ ఉన్నారు.