ఖమ్మం (విజయక్రాంతి): బోనకల్ సమీపంలోని ఎన్ఎస్పి కెనాల్ వద్ద శుక్రవారం జరిగిన ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఆంధ్రప్రభ విలేకరి యార్లగడ్డ శ్రీనివాసరావు మాతృమూర్తి యార్లగడ్డ వరమ్మ ఆకస్మికంగా మృతి చెందడంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం బోనకల్లు లోని స్వగ్రహానికి వచ్చి శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించారు. ముందుగా మృతురాలు యార్లగడ్డ వరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం ట్రాక్టర్ బోల్తా పడిన సంఘటన ప్రమాదం జరిగిన తీరును, క్షతగాత్రుల వివరాలను వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, టీపిసిసి సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాలి దుర్గారావు, ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటీ రామ కోటేశ్వరరావు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరీదు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ భూక్య సైదా నాయక్, మాజీ జెడ్పిటిసి సుధీర్ బాబు, మాజీ వైస్ ఎంపీపీ గుగులోతు రమేష్, కాంగ్రెస్ నాయకులు యార్లగడ్డ కృష్ణయ్య, అంతోటీ వెంకటేశ్వర్లు, శివాలయం చైర్మన్ యార్లగడ్డ శ్రీనివాసరావు, నాగరాజు, ప్రభావతి, తదితరులు పాల్గొన్నారు.