20-04-2025 06:23:46 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): మధిర మండలంలో ఉమ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధివారం పర్యటించారు. అనంతరం సిరిపురం గ్రామంలో చెక్ డ్యాం, ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన సముదాయం, ఐటీఐ కళాశాల భవన సముదాయాలకు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. సిరిపురం గ్రామ శివారులో డిప్యూటీ సీఎం భట్టికి అక్కడి మహిళలు, గ్రామస్థులు మంగళహారతులతో ఘనంగా స్వాగతం పలికి దారి వెంట పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.