ఖమ్మం: ఖమ్మంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ,జిల్లా ప్రజా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఖమ్మం పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ప్రజా ప్రతినిధులకు అధికారులకు విద్యార్థిని విద్యార్థులకు ప్రజలకు డిప్యూటీ సీఎం అభివాదం చేశారు. ఖమ్మం పోలీస్ గ్రౌండ్ లో భట్టి విక్రమార్క జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.