17-03-2025 01:26:12 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం కొనసాగుతున్నాయి. సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka ) మాట్లాడుతూ... 2030 నాటికి 20 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి, 2035 నాటికి 40 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి(Electricity generation) లక్ష్యమని తెలిపారు. సౌర, పవన, గ్రీన్ హైడ్రోజన్ పై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. పునరుత్పాదక ఇందన వనరుల పెంపునకు క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకువస్తున్నామని వెల్లడించారు. పెద్దఎత్తున పెట్టుబడులను ప్రోత్సహించడానికి పాలసీ తెచ్చామన్న భట్టి విక్రమార్క రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోందని చెప్పారు. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో సౌర ఫలకలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పంప్డ్ స్టోరేజ్, ఫ్లోటింగ్ విద్యుత్ ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రూ. లక్ష కోట్ల మేర పెట్టుబడులకు సంస్థలతో ఎంవోయూలు చేసుకున్నామని వ్యాఖ్యానించారు. కాలుష్య రహిత, తక్కువ ధరకు విద్యుదుత్పికి దోహదం చేస్తాయన్నారు. యువతకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రకటన చేయబోతున్నారని పేర్కొన్నారు. యువతకు ప్రభుత్వపరంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. స్వయం ఉపాధి అవకాశాలపై లోతుగా అధ్యయనం చేస్తున్నామని ఉపముఖ్యమంత్రి సూచించారు.