రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క
భద్రాద్రి కొత్తగూడెం, (విజయక్రాంతి): ఇందిరామ రాజ్యంలో ఏడాది కాలంలో తెలంగాణ పర్యటకాన్ని ప్రపంచ పటంలో స్థానం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టు విక్రమార్క అన్నారు. సోమవారం ఖమ్మం ఖిల్లా ను సహచర మంత్రులతో కలిసి పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎకో టూరిజం టెంపుల్ టూరిజం కు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయన్నారు. కిన్నెరసాని నుంచి భద్రాచలం వరకు ఎకో టూరిజనికి అవకాశాలు ఉన్నాయని, నేలకొండపల్లి మండలంలోని బౌద్ధ స్తూపం మొదలుకొని జమలాపురం మీదుగా భద్రాచలం వరకు టెంపుల్ టూరిజం కు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పర్యాటక రంగ అభివృద్ధికి ఎన్ని నిధులైన వెచ్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనని తెలిపారు. ఆయన వెంట రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటక శాఖ అధికారులు ఉన్నారు.