హైదరాబాద్: ప్రజావాణిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క డా.బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రజావాణి ఇంచార్జ్ చిన్నారెడ్డి, నోడర్ అధికారి, తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలు ఎన్ని వచ్చాయి..? ఏ రకమైన సమస్యలు వచ్చాయి..? వాటికి ఎలా పరిష్కారం కనుగొన్నారన్న దానిపై అధికారలతో చర్చించారు.