calender_icon.png 15 January, 2025 | 7:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం...

31-08-2024 03:07:24 PM

 ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు మేలు జరుగుతుంది

రామగుండంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

పెద్దపెల్లి రామగుండం (విజయక్రాంతి): ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు మేలు జరుగుతుందని, శనివారం రామగుండంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ వంశీకృష్ణ, స్థానిక ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ లతో కలిసి మాట్లాడారు. రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మిస్తామని, సింగరేణి,జెన్కో సంయుక్తంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడుతాయని,  ప్రాజెక్టు ఏర్పాటుకు కావలసిన భూమి,ఇతర సౌకర్యాలు కల్పనకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించి ఎంత తొందరగా ప్రతిపాదనలు పంపితే అంత తొందరగా పవర్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామని, పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి సూత్ర ప్రకటనకు నిర్ణయించినట్టు ఆయన వివరించారు. 

ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, రామగుండంలో పవర్ ప్లాంట్ నిర్మిస్తామని నాడు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో స్పష్టంగా చెప్పాను. ఎన్నికల ముందు స్థానిక కాంగ్రెస్ నాయకులు రామగుండం పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ప్రజలకు హామీ ఇచ్చారు నేడు నెరవేరుస్తున్నామని, 1971లో ఏర్పాటుచేసిన రామగుండం RTS -B ప్లాంట్ 50 ఏళ్ల పాటు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి సేవలు అందించింది.. సాంకేతిక కారణాలతో ప్రాజెక్టును మూసివేయాల్సి వచ్చింది. ఈ ప్రాజెక్టుతో స్థానిక ప్రజలకు ఉన్న భావుద్వేగాలను గుర్తించి తిరిగి ఇక్కడే పవర్ ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించామని, ఎమ్మెల్యేలు చొరవచేసి 300 గజాల స్థలాన్ని చూపిస్తే నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్ సెంటర్లు నిర్మిస్తామన్నారు. 

యువత కోసం తెచ్చుకున్న రాష్ట్రంలో పేద విద్యార్థులు పోటీ పరీక్షలకు హైదరాబాద్ కు వెళ్లకుండా స్థానికంగానే ఆన్లైన్లో అత్యుత్తమ లెక్చరర్ ల ద్వారా ఉచితంగా పోటీ పరీక్షలకు శిక్షణ పొందవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసులు జరుగుతాయి.. విద్యార్థులు తమ అనుమానాలను ఆన్లైన్లోనే నివృత్తి చేసుకునేలా ఏర్పాటు చేశామని, ఇది సంక్షేమ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికుల కోసం కోటి రూపాయల బీమా పథకాన్ని అందుబాటులోకి తెచ్చాం.. కాంట్రాక్టు కార్మికులకు 30 లక్షల బీమా పథకాన్ని అమలు చేస్తున్నము దేశంలో ఎక్కడా లేని పథకాన్ని అమలు చేస్తున్నామని, సింగరేణిలోని అన్ని క్యాంటీన్లను ఆధునికీకరిస్తాం .. పూర్తి హైజానిక్ గా ఉండేలా చర్యలు చేపడతామనిమనిపాదయాత్ర సమయంలో రామగుండం ప్రాంతానికి సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టు పత్తిపాక రిజర్వాయర్ను ఇందిరమ్మ ప్రభుత్వంలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చాం.. ఆ మేరకు తాజా బడ్జెట్లో నిధులు కేటాయించన్నారు.