calender_icon.png 7 October, 2024 | 7:05 PM

హైడ్రా తెచ్చింది.. సీఎం కోసమో.. మంత్రుల కోసమో కాదు

07-10-2024 04:58:38 PM

చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవడానికి మేం సిద్ధం

నిర్మాణాలను కూల్చాలని ఎవరికీ ఉండదు.. కూల్చక తప్పదు

హైదరాబాద్ ను కాపాడుకునేందుకు.. కూల్చక తప్పదు

హైదరాబాద్: హైదరాబాద్ లోని చెరువులు ప్రజల ఆస్తి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైడ్రా, మూసీనదిపై సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. చెరువులు అన్యాక్రాంతం కాకుండా కొత్త నిబంధనలు తెచ్చుకున్నామని తెలిపారు. చెరువులను భవిష్యత్ తరాలకు అందించాలని డిప్యూటీ సీఎం చెప్పారు. ఇప్పటికైనా చెరువుల ఆక్రమణలను ఆపాలి కదా?, హైడ్రా తెచ్చింది.. సీఎం కోసమా.. మంత్రుల కోసమో కాదు కదా? అని ప్రశ్నించారు. మూసీలో మంచినీళ్లు లేకుండా డ్రైనేజీగా మార్చేశాం.. గతంలో ఇతర దేశాల్లోనూ నదులు డ్రైనేజీల్లా ఉండేవి.. వాళ్లు మార్చుకున్నారని చెప్పార. ఇతర దేశాలు నదులను ఆస్తులుగా మార్చుకున్నాయని భట్టి విక్రమార్క తెలిపారు.

మూసీ సుందరీకరణకు రూ. 1.50 లక్షల కోట్లు అవుతుందని ప్రతిపక్షాలు అంటున్నాయి.. టెండర్లే పిలవకుండా రూ. 1.50 లక్షల కోట్లు అవుతుందని ఎలా చెబుతారు? అని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణకు ప్రతిపక్షాలు తమ ఆలోచనలను తమకు తెలియజేయాలని భట్టి విక్రమార్క కోరారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎవరికీ ఇబ్బంది కలిగించమని విక్రమార్క హామీ ఇచ్చారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లు తొలగించిన బాధితులకు వేరేచోట ఇల్లు ఇస్తున్నామన్నారు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వాలన్నారు. కూలగొట్టిన ఇళ్లు మెరుగైన ఇళ్లను మూసీ పరివాహక బాధితులకు ఇస్తున్నామని చెప్పారు. ప్రజలకు మేలు జరగకూడదనేదేప్రతిపక్షాల అజెండా అని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. పరిపాలనతో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవాడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. నిర్మాణాలను కూల్చాలని ఎవరికీ ఉండదు హైదరాబాద్ ను కాపాడుకునేందుకు నిర్మాణాలు కూల్చక తప్పదని చెప్పారు..