calender_icon.png 7 October, 2024 | 7:08 PM

హైదరాబాద్ అంటేనే రాక్స్‌, లేక్స్‌, పార్క్స్

07-10-2024 04:20:03 PM

హైదరాబాద్: ప్రజలకు మేలు చేయాలనే తప్ప.. మాకు ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదు.. ఇది ప్రజా ప్రభుత్వం.. పారదర్శకమైన ప్రభుత్వమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్ అంటనే రాక్స్, లేక్స్, పార్క్స్, రాక్స్, లేక్స్, పార్క్స్ హైదరాబాద్ ను మరింత ఆకర్షణీయంగా చేశాయన్నారు. అని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో కొన్నేళ్లుగా చెరువులు మాయం అవుతున్నాయి. మూసీని ఆధునీకరించాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి.

శాటిలైట్ మ్యాప్ ల ద్వారా చెరువుల ఆక్రమణలను గుర్తిస్తున్నాం. గతంలో ఎన్ని చెరువులు ఉన్నాయి.. ఇప్పుడెన్ని ఉన్నాయనే వివరాలు సేకరిస్తున్నారు. హైడ్రా, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఉపముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై అపోహలు సృష్టిస్తున్నారని చెప్పారు. తప్పుడు ఆరోపణలతో ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం పారదర్శకమైన ప్రభుత్వమన్నారు. హైదరాబాద్ లోని చెరువులు ప్రజల ఆస్తి అని విక్రమార్క స్పష్టం చేశారు.