calender_icon.png 26 December, 2024 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలోనే కొత్త విద్యుత్ విధానం

06-12-2024 04:20:57 PM

జీతాలు  ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారు

 అడ్డగోలు మాట్లాడటమే బీఆర్ఎస్ పని

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే కొత్త విద్యుత్ విధానాన్ని ప్రకటిస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రతిరోజు అడ్డగోలుగా మాట్లాడటమే బీఆర్ఎస్ నేతల పనని తెలంగాణ సచివాలంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ మొత్తం రూ. 7 లక్షల కోట్లు అప్పు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక రూ. 52 వేల కోట్లు అప్ప చేసినట్లు తెలిపారు. చేసిన అప్పులకు తిరిగి బ్యాంకులకు కట్టే పరిస్థితికి తెచ్చారని వెల్లడించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి తెచ్చారని ద్వజమెత్తారు. అప్పులకు అదనపు ఆదాయం కలిసి బ్యాంకులకు కట్టే పరిస్థితి తెచ్చారు. సంక్షేమ పథకాలకు రూ. 61 వేల కోట్లు వెచ్చించామని ఆయన పేర్కొన్నారు. రైతుభరోసా, రుణమాఫీ, చేయూత, ఆరోగ్రశ్రీ, ఎల్ పీజీ, విద్యుత్ రాయితీ, రైతుబీమా, ఉపకారవేతనాలు, డైట్ ఛార్జీలు, కళ్యాణలక్ష్మి నిధులు కేటాయించామన్నారు. ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని తెలిపారు. 

గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు

గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మార్చిందని, ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని ఉపముఖ్యమంత్రి ఆరోపించారు. తమ ప్రభుత్వం 56 వేల మందికి ఉద్యోగ నియామకపత్రాలు ఇచ్చామని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే ఆర్థికరంగం గురించి శ్వేత పత్రం ఇచ్చామన్నారు. ఆర్థిక విషయాల గురించి తాము ఏమీ దాయలేదని క్లారిటీ ఇచ్చారు. విద్యుత్ రంగం గురించి చాలా దుష్ప్రచారం చేశారు. మీరు చేసిన తప్పుడు ప్రచారాన్ని తాము సమర్థంగా తిప్పికొట్టామన్నారు. విద్యుత్ విషయంలో సమగ్ర వివరాలను ప్రజలకు వివరించామని తెలిపారు.

త్వరలో కొత్త విద్యుత్ విధానం ప్రకటిస్తాం

గతేడాది కంటే విద్యుత్ డిమాండ్ పెరిగినా నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నాం.. తామ వచ్చాక సరఫరాలో ఇబ్బందులు గుర్తించామని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల సమాచారం అంతా ప్రజలకు చెప్పామన్నారు. థర్మల్ ఎనర్జీ వల్ల కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా అనేక చర్యలు చేపట్టామన్నారు. 2035 నాటికి 40 వేల మెగావాట్ల హరిత ఇంధనం అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. త్వరలోనే కొత్త విద్యుత్ విధానం ప్రకటిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. సోలార్, విండ్, హైడ్రోజన్ విద్యుదుత్పత్తికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అందరూ వద్దంటున్నా భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ మొదలుపెట్టారు. అందరూ వద్దంటున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ కట్టిందన్నారు.

కేంద్రం ఆమోదించేందుకు జాప్యం జరిగి ప్రభుత్వంపై మరింత భారం పెరిగిందని తెలిపారు. కేంద్రం జాప్యం వల్ల భద్రాద్రి ప్రాజెక్టుపై 42 శాతం అదనపు భారం పెరిగిందన్నారు. ప్రాజెక్టుపై పెరిగే ధరలన్నీ కలిపి అంతిమంగా ప్రజలపై భారం వేశారని ఆరోపించారు. పర్యావరణ అనుమతులు రాక విద్యుత్ ప్రాజెక్టుల్లో జాప్యం జరిగింది.. తాము వచ్చాక పర్యావరణ అనుమతులపై సమీక్ష చేశామని చెప్పారు. యాదాద్రి ప్లాంటును కొన్ని రోజుల్లో గ్రిడ్ కు అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. రామగుండం ఫేజ్-2 విషయంలో సకాలంలో నిర్ణయం తీసుకుంటే మేలు జరిగేదని పేర్కొన్నారు. మీ తప్పుడు నిర్ణయాల వల్ల డిస్కంలపై దాదాపు రూ. 10 వేల కోట్ల భారం పడుతోందన్నారు. అస్తవ్యస్తమైన మీ విధానాలకు సరిచేస్తూ ముందుకెళ్తున్నామని వెల్లడించారు. నూతన విద్యుత్ విధానం వచ్చాక మిగితా వివరాలు ప్రకటిస్తామని ఆయన సూచించారు.

మార్చి నుంచి విద్యుత్ జీరో బిల్లు అమలు చేస్తున్నాం

మార్చి నుంచి విద్యుత్ జీరో బిల్లు అమలుచేస్తున్నామని పేర్కొన్నారు. జీరో బిల్లుల వల్ల సుమారు 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని లెక్క చెప్పారు. అన్ని రకాల విద్యాస్థంస్థలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 39 వేలకు పైగా విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని వెల్లడించారు. విద్యా సంస్థలకు ఉచిత కరెంట్ కింద రూ. 199 కోట్లు ఖర్చు చేశాం. రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ దిశగా విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రూ. 10 వేల కోట్ల అంచనా వ్యయంతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం. మెరుగైన విద్యుత్ సరఫరాకు కొత్త ట్రాన్స్ మిషన్ లైన్లు నిర్మిస్తున్నాం.. దెబ్బతిన్న సభ్ స్టేషన్ల మరమ్మతులను అతివేగంగా చేపట్టామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.