calender_icon.png 23 December, 2024 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకర్లతో సమావేశమైన డిప్యూటీ సీఎం

23-12-2024 03:04:26 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రజాభవన్‌లో 43వ త్రైమాసిక రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) సమీక్షా సమావేశం సోమవారం జరిగింది. రైతులను సకాలంలో ఆదుకునేందుకు రబీ పంట రుణాల పంపిణీని వేగవంతం చేయాలని బ్యాంకర్లను కోరారు. ప్రజలను శక్తివంతం చేయడానికి మ్యాచింగ్ గ్రాంట్‌లు, సబ్సిడీ పథకాలలో చురుకైన భాగస్వామ్యాన్ని అభ్యర్థించారు. రాబోయే రోజుల్లో వైబ్రంట్ తెలంగాణ చూడబోతున్నారని భట్టి పేర్కొన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

రీజినల్ రింగ్ రోడ్డు పనులకు అనుమతులు వచ్చాయని, త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం వ్యవసాయం, సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రైజింగ్ కోణంలో బ్యాంకర్లు దీర్ఘ దృష్టితో ఆలోచించి ప్రణాళికలు సిద్ధం చేసుకోని  ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 2024 ఖరీఫ్ సీజన్లో 54,480 కోట్ల రుణాలు లక్ష్యం కాగా, 44,438 కోట్లు అంటే 81.57 శాతం విడుదల చేశారు. రబీ సీజన్ వ్యవసాయ రుణాల పంపిణి నెలరోజుల వ్యవధి ఉందని వేగం పెంచాలని భట్టి విక్రమార్క కోరారు. 

తెలంగాణ ప్రభుత్వం రెండు నెలల సమయంలోనే 21 వేల కోట్లు రైతుల రుణమాఫీ కింద బ్యాంకులకు జామ చేసిందన్నారు. రాబోయే ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యం అని భట్టి పేర్కొన్నారు. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి సంవత్సరం 20 వేల కోట్లు వడ్డీలేని రుణాలు ఇస్తుందన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ద్వారా 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.