calender_icon.png 31 October, 2024 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాభవన్‌లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ప్రారంభం

18-07-2024 12:43:05 PM

హైదరాబాద్: ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం గురువారం ప్రారంభమైంది. ఈ సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పలు బ్యాంకుల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రుణమాఫీ నేపథ్యంలో బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి, తుమ్మల చర్చించనున్నారు. నేటి నుంచి రైతులకు రుణమాఫీ చేసే ప్రక్రియ మొదలు కానుంది. మొదటి దశలో నేడు లక్ష రూపాయల వరకు రుణాలు మాఫీ చేయనున్నారు.