calender_icon.png 9 January, 2025 | 10:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మన బిడ్డలు బాగుండాలి: డిప్యూటీ సీఎం భట్టి

05-01-2025 06:49:48 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఎస్సీ, బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలల(SC and BC Girls Residential Schools)ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తూ మార్గమధ్యంలో బీబీనగర్ లోని ఎస్సీ, బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలను భట్టి విక్రమార్క, ఎంఎల్ఏ కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbh Anil Kumar Reddy) ఆకస్మికంగా పర్యవేక్షించారు. విద్యార్థులకు అందుతున్న మెనూ, కాస్మోటిక్ ఛార్జీల వివరాలను విద్యార్థినీలను అడిగి తెలుసుకొని విద్యార్థినీలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. డైట్ చార్జీలు పెంచక ముందు, పెంచిన తర్వాత మెనూలో వచ్చిన మార్పులు, నాణ్యత పాటిస్తున్నారా లేదా, శుభ్రత ఎలా ఉంది అన్ని విషయాలు విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

ఆ తర్వాత స్టోర్ రూమ్, తరగతి గదులను స్వయంగా డిప్యూటీ సీఎం పరిశీలించారు. విద్యార్థినీలకు అందుతున్న వైద్య సహాయం, వారి ఆరోగ్య వివరాలకు సంబంధించిన రిజిస్టర్లు పరిశీలించారు. బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలను విద్యార్థులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మన బిడ్డలు బాగుండాలన్నారు. వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచిందని డిప్యూటీ సీఎం తెలిపారు.