calender_icon.png 19 January, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీఎన్పీడీసీఎల్ నియామక పత్రాలు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం

18-01-2025 06:16:52 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో పలువురు అభ్యర్థులకు నియామక పత్రాలను ప్రజా ప్రభుత్వం శనివారం అందించింది. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హాజరయ్యారు. టీజీఎన్పీడీసీఎల్ జూనియర్ అసిస్టెంట్ కమ్ ఆపరేటర్లుగా ఎంపికైన అభ్యుర్థులకు భట్టీ విక్రమార్క చేతుల మీదుగా వారికి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టీ మాట్లాడుతూ... ఉద్యోగాలు వస్తాయని రాష్ట్రం కోసం పోరాడితే గడిచిన పదేళ్లలో నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదని, గ్రూప్-1 పరీక్షల రాయాలనే ఆశ చాలామందికి గత పదేళ్లలో నెరవేరలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఉద్యోగాలు వస్తాయని యువత నిర్ణయానికి వచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే 56 వేల మందికి నియామక పత్రాలు ఇచ్చిందని తెలిపారు.

చదువుకున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఉద్యోగం, ఉపాధి కలిగేలా కృషి చేస్తున్నామని భట్టీ పేర్కొన్నారు. విద్య, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని,  భవిష్యత్ లో మన విద్యుత్ డిమాండ్ 22,400 మెగావాట్లకు పెరగనుందన్నారు. ప్యూచర్ సీటీలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు చాలా ఉన్నాయని, వచ్చే పదేళ్లలో పెరిగే అవసరాల దృష్ట్యా 31 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక తయారు చేస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా 200 యూనిట్ల మెగావాట్ల ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం విద్యుత్ శాఖకు ప్రతినెలా రూ.148 కోట్లు చెల్లిస్తుందని స్పష్టం చేశారు. రైతుల మోటార్లకు సోలార్ పంపుసెట్లు అందించాలని ప్రణాళిక సిద్దం చేసి పైలెట్ ప్రాజెక్టుగా ఇప్పటికే 25 గ్రామాల్లో సోలార్ పంపుసెట్లు అందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.