calender_icon.png 27 February, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంభో.. శివ శంభో..

27-02-2025 12:00:00 AM

ఉమ్మడి జిల్లాలో శివనామస్మరణతో మార్మోగిన శైవక్షేత్రాలు

స్నానాల లక్ష్మీపురం జాతరకు పోటెత్తిన భక్తజనం

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతుల ప్రత్యేక పూజలు

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి 

తండోపతండాలుగా భక్తజనం 

ఖమ్మం, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని జిల్లాలోని శివాలయాలు శివ నామ స్మరణతో మారుమోగాయి. ఖమ్మం లక్ష్మీ నరసింహ దేవస్థానం, తీర్ధాల, స్నానాల లక్ష్మీపురం, మధిర శివాలయం, కూసుమంచి పురాతన శివాలయం తదితర ఆలయాలకు భక్తులు భారీగా తరలి వచ్చారు.ఖమ్మం రూరల్ మండలం తీర్థాల గ్రామంలోని సంగమేశ్వర స్వామి దేవాలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి  ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వైరా మండలంలో..

వైరా, ఫిబ్రవరి 26 : ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని స్నానాల లక్ష్మి పురం గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి పర్వదినం సందర్బంగా జరిగే జాతరకు ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తజనం పోటెత్తారు... వైరా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం నుండి జాతరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు ద్వారా, ప్రైవేట్ వాహనాలు ద్వారా భక్తులు పుణ్యక్షేత్రం చేరుకుని పుణ్య స్నానాలు చేసి దైవదర్శనం చేసుకున్నారు. వైరా పోలీస్ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు నిర్వహించి ప్రత్యేక విఐపి వివిఐపి సాధారణ పార్కింగ్ ను వేరువేరుగా ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి అంతరాయం జరగకుండా చూశారు..

తెలంగాణ రాష్ర్ట ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నందిని దంపతులు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అర్చకులు వేద పండితులు ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో వారికీ ఘన స్వాగతం పలికారు.. అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గోత్ర నామమైన దత్తాత్రేయ గోత్రంతో దేవాలయంలో బట్టి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బట్టి దంపతులను ఆలయ అర్చకులు గ్రామస్తులు ఘనంగా శాలువాలతో సత్కరించారు. అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క  జాతర ఏర్పాట్లను పరిశీలించారు. ఖమ్మం జిల్లా ఎంపీ రఘురామరెడ్డి  ఆలయాన్ని దర్శించారు.

ఆలయ ప్రాంగణంలో ఏర్పా టు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. దైవ దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. వైరా శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ దంపతులు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు స్వాగతం పలికారు.. రాష్ర్ట గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, బొర్రా రాజశేఖర్ పార్టీ వైరా మండల అధ్యక్షులు శీలం వెంకట  నర్సిరెడ్డి, సూతకాని జైపాల్, దొబ్బల సౌజన్య, దొడ్డ పుల్లయ్య, మచ్చ బుజ్జి, దొడ్డ ఉషారాణి, నూతి సత్యనారాయణ, గంగారావు, మాజీ ఉప సర్పం మల్లు రామకృష్ణ, పనితి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పులకించిన వీర కాశీపట్నం శివాలయం.. 

తిరుమలాయపాలెం, ఫిబ్రవరి 26 ః శివరాత్రి సందర్భంగా శివనామస్మరణతో మార్మోగాయి. పిండిప్రోలు వీర కాశీపట్నం శివాలయంలో అలంకరణ ప్రాయంగా విద్యుత్ కాంతులతో భక్తులకు శివాలయం దర్శనమిచ్చింది. ఆలయ కమిటీ ఆలయ వ్యవస్థాపకులు కాశీపట్నం పీఠాధిపతి దేవాలయ ధర్మకర్తలు చైర్మన్ పూజారులు మడి కంటి  వీరభద్ర స్వామి మడి కంటి  సుగుణ గురుస్వామి మడి కంటి శంకర్, మడి కంటి నాగమణి  ధర్మపత్నిచే భక్తిశ్రద్ధలతో శివాలయాలను అలంకరించారు.  శివాలయంలో శివపార్తుల కల్యాణ సందర్భంగా పీటల మీద  మడికంటి వీరభద్ర స్వామి  సుగుణమ్మ దంపతులు కళ్యాణాన్ని దగ్గరుండి వేదమంత్రాల స్వామి వారి కల్యాణాన్ని అత్యంత అత్యంత ఘనంగా నిర్వహించారు. 

శివనామ స్మరణతో మార్మోగిన ఇస్లావతండా 

మండల పరిధిలోని ఇస్లావత్ తండాలో వేములవాడ రాజరాజేశ్వరి శివాలయంలో శివరాత్రి సందర్భంగా శివనామ స్మరణతో వేములవాడ రాజరాజేశ్వరి శివాలయంలో విద్యుత్ కాంతులతో భక్తులకు శివాలయం దర్శనమిచ్చింది ఇస్లావత్ తండా గ్రామస్తులు శివాలయం దగ్గర ఏర్పాటుచేసిన నీటి కొలనులో  భక్తులు భక్తిశ్రద్ధలతో స్నానము ఆచరించి అత్యంత భక్తి శ్రద్ధలతో శివుని దర్శించుకుని మొక్కుల్ని  చెల్లించుకున్నారు కూసుమంచిలో..

కూసుమంచి, ఫిబ్రవరి 26 ః కాకతీయుల కాలం నాటి కూసుమంచి మండలంలోని గణపేశ్వరాలయం శివరాత్రి పండుగ రోజు శివనామ స్మరణతో మార్మోగింది. రాష్ర్ట గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా వచ్చి ప్రత్యేక పూజలు చేశారు.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీఐ సంజీవ్ కుమార్ ,ఎస్‌ఐ నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి బందోబస్తును పకడ్బందీగా అమలు చేశారు.

ఆలయ కమిటీ , పోలీసు సిబ్బంది చేసే ఏర్పాట్లలో శివస్వాముల సహకారం అమోఘం.. ట్రాఫిక్ నిబంధనలు నుండి, దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయం ప్రవేశ ద్వారం దగ్గర, పులిహార పంపిణీ, మంచినీటి సౌకర్యం దగ్గర శివ స్వాముల సహకారం ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ప్రతి ఏటా వారు శివరాత్రి నాడు సేవలను అందిస్తుంది ఆలయ కమిటీకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ప్రతి ఏడాది గత ఏడాది వరకు కూడా కూసుమంచి శివాలయంకు శివరాత్రి రోజున వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా ఉండేది. కానీ ఈ ఏడాది శివాలయంకు వచ్చిన భక్తుల సంఖ్య కాస్తా తక్కువగానే ఉంది.