calender_icon.png 5 November, 2024 | 1:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాబ్ క్యాలెండర్ విడుదల.. ఏ నోటీఫికేషన్ ఎప్పుడంటే..?

02-08-2024 07:17:06 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుతం శుక్రవారం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఏయే ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలనే విషయాలను క్యాలెండర్ లో స్పష్టంగా తెలిపారు. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ను శాసనసభలో  ప్రకటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తున్నామని తెలిజేశారు.

జాబ్ క్యాలెండర్ విడుదల.. ఏ నోటీఫికేషన్ ఎప్పుడంటే..?

  1. సెప్టెంబర్ లో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ల్యబ్ టేక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నోటీఫికేషన్.. నవంబర్ లో పరీక్షలు
  2. అక్టోబర్ లో ట్రాన్స్ కో లోని వివిధ ఇంజనీరింగ్ నోటీఫికేషన్.. 2025 జనవరిలో పరీక్షలు
  3. నవంబర్ లో టెట్ నోటీఫికేషన్.. 2025 జనవరిలో పరీక్షలు
  4. 2025 జనవరిలో వివిధ శాఖల్లో గెజిటెడ్ నోటీఫికేషన్.. ఏప్రిల్ లో పరీక్షలు
  5. 2025 ఫిబ్రవరిలో డిఎస్సీ నోటీఫికేషన్.. ఏప్రిల్ లో పరీక్షలు
  6. 2025 ఫిబ్రవరిలో ఫారస్ట్ బీట్ ఆఫీసర్స్ నోటీఫికేషన్.. మేలో పరీక్షలు
  7. 2024 అక్టోబర్ లో మరో గ్రూప్-1 నోటిఫికేషన్, 2025 ఫిబ్రవరిలో గ్రూ-1 ప్రిలిమ్స్, 2025 జులైలో గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించనున్నారు
  8. 2025 ఏప్రిల్ లో ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ నోటీఫికేషన్... ఆగస్టులో పరీక్షలు
  9. 2025 మేలో మరోసారి గ్రూప్-2 నోటీఫికేషన్.. అక్టోబర్ లో పరీక్షలు
  10. 2025 జూన్ లో డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ నోటీఫికేషన్.. సెప్టెంబర్ లో పరీక్షలు
  11. 2025 జులైలో గ్రూప్-3 నోటీఫికేషన్... నవంబర్ లో పరీక్షలు
  12. 2025 జులైలో సింగరేణి పలు ఉద్యోగాల కోసం నోటీఫికేషన్.. నవంబర్ లో పరీక్షలు