calender_icon.png 17 November, 2024 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలోనే కొత్త రేషన్ కార్డులను మంజూరు

04-08-2024 08:34:45 PM

హైదరాబాద్: రేషన్ తీసుకునేందుకు సంక్షేమ పథకాలు పొందేందుకు వేర్వేరుగా గుర్తుంపు కార్డులు ఇవ్వాలనే అంశంపై చర్చ జరుగుతుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కొత్త పింఛన్లను సైతం త్వరలో మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. డా. బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డితో కలిసి ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ఆదివారం సమీక్ష నిర్వహించారు.

ప్రజావాణిలో అవకాశం ఉన్న ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజావాణి పనితీరుపై ప్రతి మూడు నెలలకోసారి ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రి భట్టి చెప్పారు. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, ధరణికి సంబంధించిన ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు నోడల్ అధికారి దివ్య దేవరాజన్ సమావేశంలో వివరించగా.. రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తామని గుర్తు చేశారు. ఇందుకు సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకొని కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.