calender_icon.png 22 February, 2025 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అద్దెలు, డైట్ చార్జీలు పెండింగ్లో పెట్టవద్దు: డిప్యూటీ సీఎం భట్టి

21-02-2025 06:37:50 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలకు సంబంధించి అధికారులతో బడ్జెట్ ప్రతిపాదనలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ ప్రీ బడ్జెట్ సమావేశం నిర్వహించిన అధికారులకు పలు సూచనలు చేశారు. హాస్టళ్లు, గురుకులాల అద్దెలు, డైట్ బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలని అధికారలను ఆదేశించారు. గురుకులాలను ప్రజాప్రతినిధులు సందర్శించేలా అధికారులు చొరవ చూపాలని కేంద్ర పథకాల నిధులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. రూ.3,000 కోట్ల బడ్జెట్ తో ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు రెండు నెలల్లో అమలు చేయాలని చెప్పారు. ఎస్టీలకు కేటాయించిన అటవీ భూముల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, అటవీ భూముల్లో అవకాడో, వెదురు సాగును ప్రోత్సహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.