calender_icon.png 12 January, 2025 | 5:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వామి వివేకానంద విగ్రహానికి నివాళులు అర్పించి డిప్యూటీ సీఎం భట్టీ

12-01-2025 01:58:19 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): యువతకు స్ఫూర్తి దేశ ప్రతిష్ఠను విశ్వవ్యాప్తం చేసిన చైతన్య స్ఫూర్తి స్వామి వివేకానంద జయంతి(Swami Vivekananda Jayanti) సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఆగి స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క షాద్ నగర్ లో ఆగారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం భూసేకరణ కార్యక్రమం త్వరలోనే కసరత్తులు చేపట్టనున్నట్లు చెప్పారు. దీనికోసం త్వరలోనే ఒక ప్రణాళిక కార్యాచరణ రూపొందించి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ విషయంలో గతంలో ఎన్నికలకు ముందు అక్కడ పర్యటించిన సందర్భంగా తాను కూడా హామీ ఇచ్చినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముందుగా భూ సర్వే కోసం ఒక ప్రణాళిక రూపొందించాక  తరువాత కార్యక్రమాలు మొదలవుతాయని స్పష్టం చేశారు.