22-03-2025 10:02:29 PM
భద్రాచలం,(విజయక్రాంతి): ఏప్రిల్ 6 తేదీన జరిగే సీతారాముల కళ్యాణానికి, 7 తేదీన జరిగే పట్టాభిషేకానికి భద్రాచలం వచ్చి పాల్గొనాలని కోరుతూ శనివారం దేవస్థానం అధికారులు అర్చకులు హైదరాబాదులోని రాష్ట్ర మంత్రులను, ఉన్నత స్థాయి అధికారులకు ఆహ్వాన పత్రికలుఅందించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఆవరణలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కు, రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ సీఎస్ రామకృష్ణారావు, ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ లకు భద్రాచల శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు సమక్షంలో భద్రాద్రి రామయ్య ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఆహ్వానించిన వారిలో భద్రాచలం దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి, దేవాలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.