26-03-2025 12:28:03 AM
హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): ఏఐసీసీ డ్రాప్టింగ్ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పార్టీ అధిష్టానం చోటు కల్పించింది. ఏప్రిల్ 8, 9 తేదీల్లో గుజరాత్‌లోని ఆహ్మాదాబాద్‌లో జరగనున్న ఏఐసీసీ సమావేశాల కోసం డ్రాప్టింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశాల్లో పార్టీ భవిష్యత్, వ్యూహాలు, విధానాలు, రాజకీయ నిర్ణయాలు రూపొందించడంలో డ్రాప్టింగ్ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. కాంగ్రెస్ అధిష్టానం డ్రాప్టింగ్ కమిటీలో తెలంగాణ నుంచి భట్టి విక్రమార్కకు అవకాశం కల్పించడంపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.