calender_icon.png 22 February, 2025 | 2:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెవలప్‌మెంట్.. ప్లానింగ్ సొసైటీ సలహా కమిటీ అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎం భట్టి

19-02-2025 01:43:14 AM

కమిటీలో మరో తొమ్మిది మంది సభ్యులు  

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి) : పది మంది సభ్యులతో రాష్ట్ర ప్రభు త్వం తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభ్యులుగా ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, శాంతా సిన్హా, హిమాంశు, భూక్యా, పురుషోత్తమ్‌రెడ్డి, సుఖదేవ్, ప్రవీణ్ చక్రవర్తి, ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈవో షేక్ మీరా నియ మితుల య్యారు. కమిటీ ఏర్పాటు చేస్తూ ఈ నెల14 తేదీనే ఉత్తర్వులు ఇచ్చినా.. సచివాలయంలో తొలిసారిగా మంగళవారమే సమావేశం కావడంతో విషయం బయటికొచ్చింది.