హైదరాబాద్,(విజయక్రాంతి): ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ సందర్బంగా గాంధీభన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో భట్టి మాట్టాతూ.. భూసంస్కరణలు, బ్యాంకుల జాతీయాకరణ, 20 సూత్రాల కార్యక్రమం చేపట్టిన్నట్లు తెలిపారు. అభివృద్ధిలో అందరికీ సమాన అవకాశాలు, సమ సమాజ స్థాపనకు పునాదులు వేశారని, భారత్ ను అగ్రగామిగా నిలబెట్టేందుకు గొప్ప విదేశి విధానం తీసుకొచ్చారని గుర్తు చేశారు.
నిత్యం దేశం కోసం, జాతి కోసం ఇందిరాగాంధీ పరితపించారని చెప్పారు. ఆనాడు దేశాన్ని అస్థిరపరిచేందుకు జరిగిన కుట్రను తిప్పికొట్టారని, దేశం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని హర్షం వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ మార్గమే తామందరికీ శిరోధార్యం అని, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువస్తామని ఎన్నికల హామీలో చెప్పినట్లు కొనియాడారు. తెలంగాణలో కులగణన సర్వే సమగ్రంగా నిబద్ధతతో కొనసాగుతోందని, భవిష్యత్తులో వనరులు, రాజకీయ, సామాజిక అవకాశాల కోసమే ఈ సమగ్ర కుటుంబ సర్వేను జరిపిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి పేర్కొన్నారు.
ఈ కులగణన సర్వే దేశానికి రోల్ మోడల్ గా నిలవబోతోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేసి, ఉచిత బస్సు కోసం నెలకు రూ.400 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని, యూపీఎస్సీ మాదిరిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. రూ.500కి గ్యాస్ సిలిండర్ పథకం అందించి స్వల్ప ధరలో మెరుగైన జీవితం, 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. మహిళా శక్తికి వందనం మహిళల ప్రగతికి అభివందనం అన్నారు.