calender_icon.png 15 April, 2025 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచిర్యాలలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి

14-04-2025 02:59:41 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సోమవారం ఆవిష్కరించారు. రాళ్ళవాగు పక్కన కరకట్ట నిర్మాణానికి శంఖుస్థాపనతో పాటు పలు పథకాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం మంచిర్యాల ప్రభుత్వ పాఠశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో భట్టీతో పాటు మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భాంగా భట్టీ విక్రమార్క మాట్లాడుతూ... రూ.300 కోట్లతో మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని, రాళ్లవాగు నుంచి గోదావరి పరిసరాలు ముంపునకు గురికాకుండా రూ.260 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం చెప్పడుతామని చెప్పారు. రూ.1200 కోట్లతో మంచిర్యాల నియోజక వర్గ అభివృద్ధి పనులు చెప్పడుతామన్నారు. మంచిర్యాల అభివృద్ధి ఆగదు.. ఈ ప్రాంత అభివృద్ధి కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణం చెప్పడుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.