calender_icon.png 12 March, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డా. మల్లు వెంకటేశ్వర్లుకు డిప్యూటీ సీఎం బట్టి దంపతుల నివాళి

02-02-2025 11:09:15 PM

వైరా (విజయక్రాంతి): తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నందిని దంపతులు ఆదివారం స్వర్గీయ డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు ప్రథమ వర్తంతి కార్యక్రమంకు హాజరై చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైరా మండల పరిధిలోని స్నానాల లక్ష్మీపురం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రం వద్ద మల్లు  కుటుంబీకులైన తల్లిదండ్రులతో పాటు తన సోదరుడు డాక్టర్ మల్లు వెంకటేశ్వర్లు సమాధి వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం స్వగ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నాలుగు కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్, డిసిసి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పూవాళ్ళ దుర్గాప్రసాద్, శీలం వెంకట నర్సిరెడ్డి, దొడ్డా పుల్లయ్య, ఏదునూరి సీతరాములు, పమ్మి అశోక్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.