calender_icon.png 25 April, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థులను అభినందించిన ఉప ముఖ్యమంత్రి..

24-04-2025 05:12:28 PM

భద్రాచలం (విజయక్రాంతి): ఏజెన్సీ కేంద్రం అయినా భద్రాచలంలో లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థ(Little Flower Educational Institute)లను ఏర్పాటు చేసి మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక పద్ధతులలో విద్యను బోధిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకే కాక తెలంగాణ రాష్ట్రానికి తలమానికంగా నిలుస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) అభినందించారు. ఏజెన్సీ ప్రాంతం నుండి విద్య ఆణిముత్యాలను అందిస్తున్న లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థలు రాష్ట్రానికే గర్వకరమన్నారు.

ఇటీవల ఎన్టిఏ ప్రకటించిన మెయిన్స్ ఫలితాలలో ఓపెన్ కేటగిరి ఆల్ ఇండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకులను సాధించడంతో పాటు ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన సీనియర్ జూనియర్ ఇంటర్ ఫలితాలలో అద్భుత విజయాలను కైవసం చేసుకున్న లిటిల్ ఫ్లవర్స్ విద్యార్థినీ విద్యార్థులను భట్టి విక్రమార్క తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీనియర్ ఇంటర్ ఫలితాలలో 993/1000 ఇద్దరు విద్యార్థులు సాధించి రాష్ట్రంలోని సంచలనాన్ని సృష్టించడంతో పాటు 990/1000 కి పైగా ఐదుగురు విద్యార్థులు మార్కులు సాధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అగ్రస్థానంలో నిలిచారని జూనియర్ ఇంటర్లో సైతం ఎంపీసీ విభాగంలో468/470 తో పాటు బైపీసీ విభాగాలలో 438/440 మార్కులు సాధించి రాష్ట్ర మొదటి ర్యాంకులను కైవసం చేసుకోవడంతో పాటు పదిమందికి పైగా 460/470 పై మార్కులు సాధించి చరిత్రను తిరగ రాశారని అభినందించారు.

విద్యను వ్యాపార ధోరణిలో చూడకుండా ఏజెన్సీ కేంద్రంలో సాధారణ ఫీజులతో కార్పొరేట్ విద్యను అందిస్తూ లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థలు రాష్ట్రంలోనే ఉత్తమ ర్యాంకులను కేవలం చేసుకుంటున్నాయని కొనియాడారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధను చూపిస్తూ ఒక ప్రణాళికతో విద్యాబోధన చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే భద్రాచలం విద్యార్థులను అగ్రస్థానంలో నిలిపిన సంస్థల యాజమాన్యాన్ని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఏజెన్సీ ప్రాంతంలో విద్యాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ ప్రాంతంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వం తలపెట్టిన ఈ మహా కర్తవ్యానికి ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలు సహకరించాలని కోరారు. అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు భట్టి చేతుల మీదుగా జ్ఞాపికలను అందించగా ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్లు మాగంటి శ్రీనివాస వరప్రసాద్, మాగంటి రమేష్ బాబు, మాగంటి సిరి లక్ష్మి, గణితం అధ్యాపకులు ఎండి బషీర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.