calender_icon.png 27 February, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోదరభావంతో క్రీడా పోటీలు

27-02-2025 12:00:00 AM

కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 

ఖమ్మం / చింతకాని ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : చింతకాని మండలం నేరడ గ్రామంలో నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటుచేసిన కబడ్డీ పోటీలను రాష్ర్ట ఉప ముఖ్యమంత్రి,ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ప్రశాంతమైన వాతావరణం లో శాంతియుతంగా క్రీడలు నిర్వహించాలని, దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని భట్టి అన్నారు. క్రీడలు క్రీడాకారులకు మానసిక ఉల్లాసాన్ని శరీర దృఢత్వాన్ని ఇస్తాయని ఎటువంటి కక్షలకు పోకుండా సోదర భావంతో ఆటల పోటీలను విజయవంతం చేయాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయుడు సత్యనారాయణ,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మండల  పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర్లు,మడుపల్లి భాస్కర్ గౌడ్ కన్నెబోయిన గోపి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూరి ప్రగతి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా స్థానిక శివాలయంలో భట్టి, సతీమణి మల్లు నందిని ప్రత్యేక పూజలు నిర్వహించారు.