calender_icon.png 15 January, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోతు

23-12-2024 12:00:00 AM

రెండు పదాల మధ్య శూన్యం 

జీవితమంత లోతు 

వాక్యాలు నిత్యనూతనం 

కవి కలల లాగా 

బరువైన భావాలు ఉండవు 

ఊహలుకూడా ఉయ్యాలమీద 

వాలిన సీతాకోకల్లా అందంగా ఉంటాయి 

కన్నీళ్లు కవిత్వారణ్యంలోకి 

దారి చూపే తీతువు పిట్టలు 

గొంతులో ముద్ద కట్టుకున్న బాధని కరిగించే

ఒకే ఒక్క పనిముట్టు కవిత్వం 

చూపులో దాకున్న దుఃఖాన్ని 

వెలిగిచ్చేది కాలమొక్కటే 

పదాలన్నీ పత్రహరిత శోభితాలు కావు 

క్షతగాత్ర ఆర్తనాదాల గుల్మాలు.