calender_icon.png 16 January, 2025 | 5:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాలో మాంద్యం భయాలు

06-08-2024 03:31:50 AM

అమెరికాలో జులై నెలలో ఉద్యోగాల కల్పన అంచనాల కంటే నెమ్మదించింది. దీంతో మాంద్యం ముంచుకొస్తుందనే ఊహాగానాలు బలపడ్డాయి. వ్యవసాయేతర రంగాల్లో జులై నెలలో 1.14 లక్షల ఉద్యోగాలు మాత్రమే నమోదైనట్లు అక్క డి లేబర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. వాస్తవానికి ఇది 1.75 లక్షల వరకు ఉండొచ్చని ముందుగా అంచనా వేశారు. జనాభా వృద్ధికి అనుగుణంగా ఉపాధి అవకాశాలను కల్పించాలంటే ఈ సంఖ్య 2 లక్షల వరకు ఉండాలని గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవంగా ఆ సంఖ్య చాలా దిగువన ఉండటంతో మాంద్యం రావొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు అక్కడ నిరుద్యోగిత రేటు 4.3 శాతానికి చేరుకుంది.

దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్  ప్రకటించినదానికన్నా ముందుగానే వడ్డీ రట్లును తగ్గించవచ్చే ఊహాగాలు వినిపిస్తున్నాయి. గత వారం ప్రారంభంలో ఫెడరల్ రిజర్వ్ తన ద్రవ్య విధానంలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పూ చేయలే దు. అక్టోబర్‌లో వడ్డీరేట్ల తగ్గుదల ఉండవచ్చన్న సంకేతాలను ఈ సందర్భంగా ఇచ్చింది. ఈ క్రమంలో ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వైఖరి దూకుడుగా ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సెప్టెంబర్‌లోనే వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియను ప్రారంభించవచ్చని అంటున్నారు. 

మరోవైపు బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇటీవల వడ్డీరేట్లను 0.25 శాతం పెంచింది. అలాగే బాండ్ల కొనుగోళ్లను తగ్గించింది. ఫలితంగా అక్కడి కరెన్సీ యెన్ బలపడింది. దీంతో నష్టాలను నివారించడం కోసం మదుపర్లు తమ వాటాలను విక్రయించడం ప్రారంభించారు. ఫలితంగా అమెరికా టెక్ సాక్స్‌లోఅమ్మకాలు వెల్లువెత్తాయి. దీని ప్రభావం ఆసియా సహా మొత్తం ప్రపంచ మార్కెట్లపై కనిపించిం ది. జపాన్ నికాయ్ సూచీ సోమవారం ఓ దశలో 14 శాతానికి పైగా కుంగింది. ఇతర ప్రపంచ మార్కెట్లూ అదే బాటలో కొనసాగాయి.